కడప జిల్లా పర్యటన రద్దు చేసుకున్న ఏపీ సీఎం జగన్

  • షెడ్యూల్ ప్రకారం నేడు కడప జిల్లాలో సీఎం పర్యటన
  • కడప ఎయిర్ పోర్టు వద్ద దట్టంగా పొగమంచు
  • లభించని ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్
  • చివరి నిమిషంలో పర్యటన విరమించుకున్న సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ ఇవాళ కడప జిల్లాలో పర్యటించాల్సి ఉండగా, అనూహ్య రీతిలో ఆయన పర్యటన రద్దయింది. కడప విమానాశ్రయం పరిసరాల్లో పొగమంచు దట్టంగా ఉండడంతో ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్ లభించలేదు. ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం చాలాసేపు వేచి చూసినా, వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నారు. 

ఇవాళ కడపలోని అమీన్ పీర్ ఉర్సు ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొనాల్సి ఉంది. ఈ మధ్యాహ్నం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే కడప విమానాశ్రయం పరిసరాల్లో పొగమంచు ఎంతకీ తొలగకపోవడంతో సీఎం పర్యటన రద్దయింది. 

Jagan
Kadapa District
YSRCP
Andhra Pradesh

More Telugu News